తలలో కత్తి... చేతిలో ఫోన్... షాకింగ్ వీడియో ఇదిగో!
- తలలో కత్తితో ఆసుపత్రిలో నిలబడ్డ యువకుడి వీడియో వైరల్
- ముంబై మన్‌ఖుర్డ్‌లో వ్యక్తిగత కక్షలతో జరిగిన దాడిగా వెల్లడి
- దాడికి పాల్పడిన ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- క్లిష్టమైన సర్జరీ చేసి బాధితుడి ప్రాణాలు కాపాడిన వైద్యులు
ముంబైలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తలలో పెద్ద కత్తి దిగబడినప్పటికీ ఓ వ్యక్తి ఆసుపత్రిలో నిలబడి ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబై పోలీసుల కథనం ప్రకారం.. మన్‌ఖుర్డ్‌లోని పీఎంజీపీ కాలనీ ప్రాంతంలో మే 1వ తేదీ రాత్రి 11:45 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. బాధితుడిని రోహిత్ నాగనాథ్ పవార్‌గా గుర్తించారు. కొంతమంది వ్యక్తులతో రోహిత్‌కు పాత గొడవలు ఉన్నాయని, ఈ క్రమంలోనే వారు పదునైన ఆయుధాలతో అత్యంత దారుణంగా దాడి చేశారని పోలీసులు తెలిపారు. దాడి తీవ్రతకు ఓ కత్తి రోహిత్ పుర్రెలోకి బలంగా దిగబడింది.
దాడి తర్వాత తీసిన వీడియోలో రోహిత్ తలలో కత్తి ఇరుక్కుని ఉండగానే ఆసుపత్రిలో నిలబడి ఫోన్ మాట్లాడటం కనిపించింది. ఈ షాకింగ్ దృశ్యాలు చూసి నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. వెంటనే వైద్యం ఎందుకు అందించలేదంటూ ఆసుపత్రి సిబ్బందిపై తొలుత ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ ఘటనపై మన్‌ఖుర్డ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి సంబంధించి ముగ్గురు మైనర్లను మే 2న అదుపులోకి తీసుకుని డోంగ్రీ రిమాండ్ హోంకు తరలించినట్లు వెల్లడించారు. బాధితుడు రోహిత్‌ను లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ హాస్పిటల్‌లో (సియోన్ హాస్పిటల్) చేర్పించారు. వైద్యులు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి అతని తలలోంచి ఆయుధాన్ని తొలగించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ దాడి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.